మైదుకూరు రేసు నుంచి వెనక్కి తగ్గేది లేదు : పుట్ట సుధాకర్ యాదవ్

SMTV Desk 2019-02-21 19:30:13  chandrababu, putta sudhakar yadav, dl ravindra reddy, tdp mla list

కడప, ఫిబ్రవరి 21: తాజాగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన నాబార్డు జాబితా నేపథ్యంలో చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబు అభ్యర్థుల్ని ఖరారు చేయని నియోజకవర్గాల్లో ఆ స్థానం నుంచి పోటీచేసేది నేనంటే నేను అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నేనంటే నేను అంటున్నారు నాయకులు. కాగా మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్ ను మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అటు ఎంపీ ఆదినారాయణరెడ్డి సైతం మైదుకూరు టికెట్ డీఎల్ రవీంద్రారెడ్డికే ఇవ్వాలని, మైదుకూరు అసెంబ్లీ నియోజకవ్గరం ఇంచార్జ్ గా ఉన్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రొద్దుటూరు నుంచి పోటీ చెయ్యించాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.

అయితే డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారనేది పుకార్లు మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేసేది తానేనని పుట్టా సుధాకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాత్రం మైదుకూరు రేసు నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మైదుకూరు అభ్యర్థిగా తననే చంద్రబాబు ప్రకటిస్తారంటూ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేసారు.