మరి కొత్తగా పార్టీలో చేరిన వారి పరిస్థితి ఏంటి?

SMTV Desk 2019-02-21 19:29:00  Chandrababu, mla list, ap, elections 2019

అమరావతి, ఫిబ్రవరి 21: కొద్దీసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో 70 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసారు. కాగా కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా.. ఎక్కువ శాతం గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్ని ఆయా నియోజకవర్గాల్లోనే ఖరారు చేసారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన అభ్యర్థుల పోటీపై చంద్రబాబు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

కాగా ఇటీవలే టీడీపీలో చేరిన కొండ్రు మురళికి టికెట్ ఖరారు చేసారు. చంద్రబాబు విడుదల చేసిన తాజా జాబితాలో ఉభయ గోదావరి, కడప జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ మూడు జిల్లాలలోనే ఎక్కువ మంది అభ్యర్థుల్ని ఖరారు చేసారు. ఈ నేపథ్యంలో తదుపరి జాబితాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు.