అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి!

SMTV Desk 2019-02-14 07:57:25  Chandrababu Naidu, Balakrishna, Basawatharaka Cancer Hospital, Amaravathi, TDP, Shivaprasad, Pratthipati Pullarao, Anand Babu, Faruq, Sravan Kumar

అమరావతి, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా మరో కొత్త ప్రాజెక్ట్ కు స్వీకారం చుట్టనుంది. రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చెయ్యనున్నారు. ఇందు కొరకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చెయ్యనున్నారు. ఈ ఆసుపత్రి వెయ్యి పడకలతో మూడు దశల్లో నిర్మించనున్నారు. ఆసుపత్రి నిర్మాణం కొరకు ఏపీ ప్రభుత్వం తుళ్లూరులో 15 ఎకరాలు కేటాయించింది.

తుళ్లూరు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం ఆసుపత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ ఉదయం 8 గంటలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు ఫారూఖ్, కిడారి శ్రవణ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. తరువాత బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో అధ్యక్షత వహిస్తారు.