'ఇష్మార్ట్ శంకర్' లో గంగవ్వ లొల్లి...!

SMTV Desk 2019-02-13 19:09:30  Ismart shankar, Puri jagannad, My village show gangavva

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మై విలేజ్ షో అనే ఓ యూ ట్యూబ్ ఛానల్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లలో నటిస్తూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెలబ్రిటిగా మారింది గంగవ్వ. చిన్నపిల్లాడి నుంచి పండుముసలికి కూడా అర్థమయ్యే రీతిలో వీడియోలు చేసిన ఈ బృందం.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చేసిన ప్రతీ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలించింది.

ముఖ్యంగా ఇందులో నటిస్తున్న గంగవ్వ మాటలన్నా.. ఆమె నటనన్నా.. ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టం. ఇప్పటి వరకూ ఈ వీడియోలు చేసిన గంగవ్వ.. ఇక నుంచి సినిమాల్లో కూడా నటించనుంది. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్‌’. పక్కా యాక్షన్ ఎంటర్టయినర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘మై విలేజ్ షో’ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన గంగవ్వ‌ కూడా ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాలో నటించనుంది. బుధవారం దర్శకుడు పూరి.. గంగవ్వను కలసి ఈ సినిమాలో నటించాలని కోరారు. ఇందుకు గంగవ్వ కూడా వెంటనే ఓకే చెప్పింది. వీరిద్దరూ దిగిన ఫొటో ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇప్పటిదాకా యూట్యూబ్‌లో వినిపించిన గంగవ్వ మాటలు.. ఇక నుంచి వెండితెరపై కనిపించనున్నాయి. కంగ్రాట్స్ గంగవ్వ’ అంటూ పోస్టులు పెడుతున్నారు.