ఇంకా 'ఆర్ఆర్ఆర్' విల్లన్ రోల్ కోసం గాలిస్తున్న జక్కన్న...

SMTV Desk 2019-02-13 18:39:54  NTR, Ram charan, RRR, Rajamouli, Ajay devgan

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దర్శక ధీరుడు రాజమౌళి మొదటిసారి ముల్టీ స్టారర్ గా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ . ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. బాహుబలి లానే ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనతో బాలీవుడ్ నటులను ఈ సినిమాలో తీసుకుంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ ఉండేది నిజమే అని తెలుస్తున్నా అది విలన్ గా మాత్రం కాదట. స్పెషల్ రోల్ లో అతను కనిపిస్తాడట.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. పరిణిత్ చోప్రా, అలియా భట్ లను అడిగారని తెలుస్తుంది. అయితే వారు ఆర్.ఆర్.ఆర్ లో నటించడానికి ఒప్పుకున్నారా లేదా అన్నదు మాత్రం తెలియదు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి.