అభిమానులపై, పార్టీ శ్రేనులపై బాలయ్య బాబు ఫైర్...ఎన్టీఆర్ ఎఫెక్ట్

SMTV Desk 2019-02-13 18:23:04  NTR Kathanayakudu, Balakrishna, TDP, Yatra, YSRCP

హైదరబాద్, ఫిబ్రవరి 13: ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఊహించని డిజాస్టర్ కావడంతో నటసింహ నందమూరి బాలకృష్ణ తన అభిమానులపై, తెదేపా పార్టీ శ్రేనులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని సమాచారం. సినిమా డిజాస్టర్ అయితే అభిమానులు ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా...అసలు మ్యాటర్ అదే వైఎస్సార్ జీవితం ఆధారంగా ఆయన చేసిన పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలే కథా వస్తువుగా తెరకెక్కిన చిత్రం యాత్ర, విడుదలైన మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా విజయానికి కథలో ఉన్న ఎమోషన్ ఒక కారణం అయితే, సినిమాను వైసీపీ శ్రేణులు తమ సొంత సినిమాగా భావించి బాధ్యతగా తీసుకొని సొషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసి సినిమా హిట్ కు కారణం అయ్యారు. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లపై బాలయ్య కోపానికి కారణం అవుతోంది, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మంచి టాక్ వచ్చినప్పటికీ కమెర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. వైసీపీ కార్యకర్తల లాగా టీడీపీ కార్యకర్తలు సినిమాను ఓన్ చేసుకోలేదని ఆయన భావిస్తున్నారట.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో భాగం “ఎన్టీఆర్ మహానాయకుడు” షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతుంది. కథానాయకుడు ఇచ్చిన షాక్ తో క్రిష్ ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారట. మరి బాలకృష్ణ అనుకుంటున్నట్టు మహానాయకుడు సినిమానైనా తెలుగు తమ్ముళ్లు ఓన్ చేసుకుంటారో లేదో చూడాలి.