పదోన్నతి పొందిన కాంగ్రెస్ మహిళా నేత..

SMTV Desk 2019-02-13 18:22:50  rahul gandhi, Priyanka Gandhi, AICC General Secretary, raguveera reddy, sunkara padmasri, aicc

విజయవాడ, ఫిబ్రవరి 13: కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీకి ఏఐసీసీ ప్రమోషన్ ఇచ్చింది. సుంకర పద్మశ్రీని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ నియామక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీ ఎనలేని సేవలు అందించారు. ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆమె వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పద్మశ్రీని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ నియామక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్దితో నిర్వహిస్తానని, పార్టీని మరింత బలోపీతం చేయటానికి కృషి చేస్తానని సుంకర పద్మశ్రీ తెలిపారు. కాగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా విశాఖట్నంకు చెందిన రమణీకుమారిని నియమించారు.