'డియర్ కామ్రేడ్' రీషూట్...నిర్మాతలను రిక్వెస్ట్ చేసిన విజయ్

SMTV Desk 2019-02-13 16:32:36  Dear comrade movie, Vijay devarakonda, Mythri movie makers, Producers, Dear comrade movie re shoot

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అతి తక్కువ సినిమాలు చేసి యూత్ ఐకాన్ గా మారిన టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ టాక్సీవాలా తరువాత వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్ . ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌ైన ఈ చిత్రంపోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీని విజయ్ దేవ‌ర‌కొండ‌కు చూపించార‌ట‌. అయితే ఫైన‌ల్ కాపీ చూశాక విజ‌య్ రిలీజ్ కి అభ్యంత‌రం చెప్పినట్లు సమాచారం.

కొన్ని సీన్స్ విష‌యంలో రీషూట్ అవ‌స‌రం అని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఈ విష‌య‌మై మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్ని తానే రిక్వెస్ట్ చేసి, రీషూట్ లకు ఒప్పించాడని చెప్తున్నారు. వాళ్లు కూడా సరైన హిట్ లేక గత కొద్ది కాలంగా డీలా పడి ఉన్నారు, దీంతో రిస్క్ చేయటం ఇష్టం లేక రీషూట్ కు ఓకే చెప్పారట నిర్మాతలు.

ఈ సినిమా మే నెలలో విడుదల కానుందని ఆ మధ్య వార్తలొచ్చాయి, ఇప్పుడు రీషూట్ ఉండబోతుందని వస్తున్న వార్తలు బట్టి చుస్తే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని అర్థం అవుతుంది.