ఇంగ్లాండ్ పోలీసుల ట్విట్టర్ ఖాతాలో తలైవా హవా....

SMTV Desk 2019-02-13 14:36:07  England Police Twitter Account, Rajinikanth, Robo, Drunk and drive

హైదరాబాద్, ఫిబ్రవరి 13: సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయసుని పక్కన పెట్టేసి వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలందరికీ గట్టి పోటీనిస్తున్నాడు. రోజురోజుకు ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారే తప్ప తగ్గడంలేదు. ఆయనను చూసి చాలామంది హీరోలు వయసు అయిపోయినా హీరోగానే నటించొచ్చు అని అనుకుంటున్నారు. కానీ రజనీకాంత్ విషయం అందరికీ చాలా భిన్నంగా వుంటుందనే చెప్పాలి.

రాష్ట్రాలు, దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటున్నారు.ఈ మధ్య 2.0, పేటా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా వుండగా ఇంగ్లండ్ పోలీస్ తమ ట్విటర్‌లో రజనీకాంత్‌, అమీ జాక్సన్ ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఓ వ్యక్తి మోతాదుకి మించి తాగి కారు డ్రైవింగ్ చేస్తుండగా, డర్బీ పోలీసులు ఆయనకి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేశారు.

ఇందులో రీడింగ్ చాలా ఎక్కువ చూపించింది. దీంతో సైంటిస్ట్‌లు కూడా షాక్ అవుతున్నారనేలా రజనీకాంత్ ఫోటోని వాడినట్టు తెలుస్తోంది. ఇది సైన్స్‌కి కూడా అంతు చిక్కకుండా ఉంది అనే కామెంట్ కూడా రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో 2.0 సినిమాలోని సైంటిస్ట్ చిట్టిది. ఆయన పక్కనే అమీ జాక్సన్ కూడా వుంది.