టీడీపీ సీట్ల లొల్లి, చంద్రబాబు జోక్యం

SMTV Desk 2019-02-13 13:14:27  Chandrababu Naidu, Aadinarayana Reddy, Ramasubba Reddy, MLA, MLC, TDP

అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిస్థుతులు వేడెక్కాయి. సీట్ల సర్దుబాటు విషయంలో మరి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో కూడా ఎమ్మెల్యే టికెట్టు కోసం సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు నాకంటే, నాకంటూ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మెట్టుదిగి రాకపోవడంతో చివరికి ముఖ్యమంత్రి చంద్ర్తబాబు నాయుడు జోక్యం చేసుకుని పరిష్కారం చూపారు. అసెంబ్లీ టికెట్టు రామసుబ్బారెడ్డికి, కడప ఎంపీ టికెట్టు ఆదినారాయణరెడ్డికి ఇస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. అదే విధంగా రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని, ఆ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు ఇస్తానని చెప్పడంతో సమస్య కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రామసుబ్బారెడ్డి రాజీనామా చేయగా దాన్ని గవర్నర్‌ ఆమోదించినట్లు సమాచారం.