దీదీ ఢిల్లీకి రావద్దంటూ పోస్టర్లు!

SMTV Desk 2019-02-13 09:38:30  Mamatha Banerjee, Aravind Kejriwal, Rajiv Kumar, CBI, Save Youth Democracy, Delhi, Deeksha

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఈమధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సేవ్‌ కంట్రీ, సేవ్‌ డెమోక్రసీ పేరిట కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన మూడు రోజుల దీక్ష సంగతి తెలిసిందే. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్ కుమార్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె చేపట్టిన ఈ దీక్షను సుప్రీం తీర్పుతో విరమించారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక పక్షాలన్నిటినీ ఒకే వేదికపై తీసుకొచ్చి మెగా ర్యాలీ కూడా నిర్వహించారు.

కాగా, నేడు ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ దీక్ష చేపట్టనున్నరు. ఈ దీక్షకు మద్దతుగా మమతా బెనర్జీ హాజరుకానున్నారు. ఇందుకోసం మమతా ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆమె రాకపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కొందరూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీదీ, ఈ ప్రజాస్వామ్య భారత దేశంలో మిమ్మల్ని సాధరంగా ఆహ్వానిస్తున్నాం. కానీ దయచేసి మీరు మీ దాదాగిరీని మాత్రం ఇక్కడకు తీసుకురావద్దు అని పోస్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే, ఈ పోస్టర్ల పై సేవ్‌ యూత్‌ డెమోక్రసీ అని రాశారు.