దేవుడి దయవల్ల బ్రతికే వున్న : ఇండియన్ క్రికెటర్

SMTV Desk 2019-02-13 09:00:38  Suresh raina, Team India, Indian Cricketer, Death news, fake news, twitter, youtube fake news

స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 13: సోషల్ మీడియా వల్ల కొంత మేర లాభం , కొంత మేర నష్టం జరిగే అవకాశాలున్నాయి. కానీ కొందరి వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువ. ఇపుడు సోషల్ మీడియాను కొందరు తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మలచుకుంటున్నారు. సెలబ్రిటీలు అనారోగ్యం పాలైనట్టు, లేదంటే ఏకంగా మృతి చెందినట్టు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఒక వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. అదేంటంటే టీం ఇండియా ఆల్ రౌండర్ సురేశ్ రైనా ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. రైనా కొంత కాలంగా క్రికెట్ ఆడకపోగా.. మీడియాలోనూ కనిపించట్లేదు. దీంతో ఈ వార్త నిజమేననుకుని ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సురేష్ రైనా కుటుంబ సభ్యులు సైతం ఆయన గురించి జరుగుతున్న దుష్ప్రచారానికి కలత చెందారు. తాజాగా రైనా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను దేవుడి దయవల్ల బాగానే ఉన్నానని పేర్కొన్నాడు. ‘‘నేను కారు ప్రమాదానికి గురయ్యానని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అసత్యం. ఇవి నా కుటుంబాన్ని, స్నేహితులను తీవ్రంగా కలచివేశాయి. ఇలాంటి వార్తలు పట్టించుకోకండి. దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. ఆ యూట్యూబ్‌ ఛానళ్లపై ఫిర్యాదు చేశా. త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు.