నేడు ఢిల్లీకి పయనమవనున్న బాబు

SMTV Desk 2019-02-13 07:39:51  Chandrababu Naidu, Aravind Kejriwal, Deeksha, Delhi

అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పయనమవనున్నారు. ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు మధ్యాహం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు తన ముఖ్యమైన కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకున్నారు చంద్రబాబు. ఈరోజు సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రేపటి ఉదయానికి వాయిదా వేశారు. అలాగే, విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి నేడు చంద్రబాబు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, దానిని కూడా గురువారానికి మార్చారు.