సీఎం కి రైతుల లేఖ..

SMTV Desk 2019-02-13 00:14:39  KCR, trs, telangana cm, formers letter, telangana formers

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెరాస అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ కి పత్తి రైతులకు మద్దతు ధర అమలు చేయాలని, బోనస్ ఇవ్వాలని రైతుల సంగం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతు సంఘం లేఖ రాసింది. ఈ లేఖలో తెలంగాణాలోని రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో తేమ 8 నుంచి 12 శాతం ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పంపాలని, అలాగే సీసీఐ కేంద్రాల్లో నాణ్యత తనిఖీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దళారులు, వర్తకుల నియంత్రణ లేక నష్టపోతున్న మిరప రైతులను కూడా ఆదుకోవాలని కోరారు. క్వింటా మిరప దర రూ.10 వేలతో మార్క్ ఫెడ్ వంటి సంస్థలచే కొనుగోలు చేయించాలని, మిరప కాలనీలుగా గుర్తించి పంట ఉత్పత్తి, శుద్ధి, అమ్మకాలకు ఏర్పాటు చేయాలని, ముదిగొండ తరహాలో ఇతర ప్రాంతాల్లో మిరప పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ని కోరారు.