మెగా హీరోకి విల్లన్ గా విజయ్ సేతుపతి...!

SMTV Desk 2019-02-13 00:10:25  Panja vaishnav tej, Vijay setupati, Syeraa narashimhareddy, Sukumar

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మెగా మేనల్లుడు, సాయిధరంతేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో వైష్ణవ్ హీరోగా కనిపించనున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాలకు లాగే ఇది కూడా బోల్డ్ కంటెంట్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్రలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవి విజయ్ సేతుపతి పేరును సజెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో విజయ్ చాలా బిజీ అయ్యాడు. హీరోగా చేస్తూనే విలన్ పాత్రలు చేస్తున్నారు.

తెలుగులో విజయ్ సేతుపతి మెగాస్టార్ సైరా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ నటనకు ముగ్దుడైన మెగాస్టార్.. విజయ్ పేరును సుకుమార్ సినిమాకు సజెస్ట్ చేశారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.