550 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు..

SMTV Desk 2019-02-12 23:57:58  appsc, appsc notification 2019, forest deportment, serve and land records

అమరావతి. ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 550 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా అటవీ శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఖాళీగా ఉన్న 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

➤ అటవీ శాఖలో..
→ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లు- 50
→ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు- 330
→ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు- 100
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 5, చివరి తేదీ : మార్చి 27

➤ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలో..
→ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు - 28
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 27, చివరి తేదీ : మార్చి 20

➤ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో..
→ డిప్యూటీ మేయర్లు- 29
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 20, చివరి తేదీ : మార్చి 13

➤ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో- 18
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 19, చివరి తేదీ : మార్చి 13