పీఎం తో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్స్...?

SMTV Desk 2019-02-12 20:32:30  Narendra modi, Lakshmi parvati, Lakshmi NTR Movie, Lakshmis NTR Movie promotions with PM, Ram gopal varma

హైదరాబాద్, ఫిబ్రవరి 12: సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యింది. వారు మాట్లాడుకునే సమయంలో తీసిన ఫోటోను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

అయితే అ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఫొటోలో కనిపిస్తోన్న ఫోటోని చూసి లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పీఎం సైడ్ నుంచి ప్రమోషన్సా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

దీంతో అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత జనతా పార్టీ ఇటీవల నిర్వహించిన గుంటూరు సభ కోసం హాజరైన మోడీ లక్ష్మి పార్వతిని ప్రత్యేకంగా కలుసుకున్నారు.

అది వర్మకు తెలియడంతో సినిమాకు ప్రమోషన్ లా వాడేస్తున్నాడు. లక్ష్మి పార్వతి ఎంట్రీ అనంతరం ఎన్టీఆర్ కెరీర్ ఏ విధంగా ముందుకు సాగింది అనేది వర్మ తన సినిమాలో చూపించనున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేయనున్నారు.