జనసేనకు నో చెప్పిన విష్ణురాజు..

SMTV Desk 2019-02-12 18:23:38   k.v.vishnuraju, janasemnaparty advisory committee chairman, pawankalyan, bv raju, ap assembly elections 2019, bhimavaram

భీమవరం, ఫిబ్రవరి 12: ప్రముఖ వ్యాపారవేత కేవీ విష్ణురాజు ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిస పలు అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా విష్ణురాజును జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాను రాజకీయాల్లోకి రాను అని ముందే స్పష్టం చేశానని అదే మాటకు కట్టుబడి ఉన్నానని విష్ణురాజు తెలిపారు. తాను జనసేన పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు సరికాదన్నారు. అయితే పవన్ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పారు. కాగా విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి సహకరించేందుకే పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేశానన్నారు. ఆయన పవన్ ని కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు.

కాగా పార్టీ విధానాల రూపకల్పనలో విష్ణురాజు ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయన్నపవన్ వెంటనే ఆయనను జనసేన పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీలు, పర్యావరణం అంశాలపై ఆయనకు అపారమైన అవగాహన ఉందని, జనసేన విధానాల రూపకల్పనలో ఆయన సలహాలు తోడ్పాటును అందిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. విష్ణురాజు రాబోయే తరానికి మంచి భవిష్యత్తును ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్న వారిలో ఒకరని కొనియాడారు. కాగా విష్ణురాజు ప్రస్తుతం బి.వి.రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.