'నా కుటుంబం-బీజేపీ కుటుంబం'

SMTV Desk 2019-02-12 12:41:11  Amit Shah, Campaign, BJP, 'Naa Kutumbam BJP Kutumbam'

గాంధీనగర్, ఫిబ్రవరి 12: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయ నాయకులూ ప్రజలను తమదైన శైలిలో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలదళం మరో కొత్త నినాదాన్ని తెర పైకి తెచ్చింది. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని తన నివాసం వద్ద నా కుటుంబం-బీజేపీ కుటుంబం అన్న నినాదంతో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ ప్రచారం ద్వారా ఐదు కోట్ల కుటుంబాలకు చేరుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు మార్చి 12వ తేది వరకు ప్రచారం కొనసాగించనుంది. ఈ పార్టీ నాయకులూ 5కోట్ల మంది ఇళ్లను కలవాలని ప్లాన్ చేస్తుంది. అమిత్ షా ప్రచారం మొదలు పెట్టిన అనంతరం సోషల్ మీడియాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ కొత్త నినాదాన్ని విస్తృతంగా షేర్ చేశారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ, బీజేపీ జెండా అభివృద్దికి, జాతీయతా భావానికి ప్రతీక. మోదీ హయాంలో అంతమైన కులతత్వానికి, కుటుంబ పాలన అంతానికి ఇదొక ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు.