మరపురాని హిట్ సినిమాలను అందించిన దర్శకుడు కన్నుమూత

SMTV Desk 2019-02-12 10:19:20  Vijaya baapineedu, Director, producer, Expired today, Gang leader, big boss, Choiranjeevi, Mohan babu, shoban babu

మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు,నిర్మాత, విజయ మాగజిన్ డైరెక్టర్ కొద్ది గంటల క్రితం తుది శ్వాశ విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన హైదరబాద్ లోని జుబ్లిహిల్ల్స్ లో తన స్వగృహంలో కన్నుమూసారు. ఆయన ఏలూరు దగ్గరలోని చాటపర్రు గ్రామం లో సెప్టెంబర్ 22, 1936లో జన్మించారు. దిగ్గజ హీరోలు అయిన శోబన్ బాబు , మోహన్ బాబు, చిరంజీవి లతో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం అందించారు.
ఈయన మోహన్ బాబు, చిరంజీవి కలిసి నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహామరాజు, ఖైది నం. 786, మగధీరుడు, బిగ్ బాస్ దొంగ కోళ్ళు లాంటి ఎన్నో హిట్ చిత్రాలని దర్శకత్వం చేసారు. మెగాస్టార్ చిరంజీవి తో ఎనలేని బంధం ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. కృష్ణరాజు నటించిన దాసరి నారాయణ రావు దర్శకత్వం లో యవ్వనం కాటేసింది సినిమా కి నిర్మాత కూడా వ్యవహరించారు.
ఆయన మృతి సినీ లోకానికి తీరని లోటు. ఈ దర్శక నిర్మాతకి SMTV తరపున అశ్రు నివాళి.