జగపతిబాబుకి 'సైరా' టీం పుట్టిన రోజు కానుక

SMTV Desk 2019-02-12 10:08:28  jagapathi babu, Saira, Chiranjeevi, Suendar Reddy, Teaser

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ మెగా స్టార్ అభిమానులలో ఆసక్తిని రేపుతున్నాయి. విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా సైరా లో ఆయన లుక్ ను, మోషన్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్ లో జగపతిబాబు తెల్లని గడ్డం, పొడవైన జుట్టు, తలపాగాతో ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు.