మామ చిరంజీవి తో అల్లు అర్జున్ నటించింది నిజమే

SMTV Desk 2019-02-12 09:27:16  Allu Arjun, Syera Narasimha reddy, Megastar Chiranjeevi, Ramcharan, Stylish star, Megapower star, Surender reddy

ఫిలిం న్యూస్, ఫిబ్రవరి 12: మెగాస్టార్ చిరంజీవి తన 151 చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నారు ఆ చిత్రమే సైరా న‌ర‌సింహ‌రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌,న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, త‌మన్నా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.
ఇక ఈ చిత్రంలో బ‌న్నీ కూడా భాగం కానున్నాడ‌ని ఇటీవ‌ల ఒక వార్త హల్ చల్ చేస్తుంది. సురేంద‌ర్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రేసు గుర్రం చిత్రం వీరిద్ద‌రికి మంచి విజ‌యాన్ని అందించ‌గా,
అప్ప‌టి నుండి వీరి మ‌ధ్య మంచి రాపో ఉందని, ఈ క్ర‌మంలోనే సైరా సినిమా కోసం బన్నీ కీల‌క పాత్ర పోషించాడ‌ని అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సైరా చిత్రంలో బ‌న్నీ కీల‌క పాత్ర పోషించాడ‌ని ,
ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంద‌ని చెబుతున్నారు. ఇందులో మ‌నోడు డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపించ‌నున్నాడు. ఇక సైరా విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుద‌ల కానుంది.