విజయసాయి రెడ్డి ట్వీట్‌పై మండిపడ్డ హరిబాబు

SMTV Desk 2019-02-12 08:13:48  Vijayasai Reddy, Haribabu, TDP, BJP, YCP, Chandrababu Naidu, Delhi Dharmaporata Deeksha

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన దీక్ష కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) నాయకులతో పాటు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ హరిబాబు కూడా ఉండడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ-బీజేపీలు బయటకి ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ లోలోపల మాత్రం తమ ప్రేమాయణం కొనసాగిస్తున్నారనడానికి నిదర్శనమంటూ ఒక ఫోటోతో ట్వీట్ చేశారు. వీరి అనైతిక బంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, కటీఫ్ అంటూ బాబు అండ్ టీం ఆ పార్టీతో చాటుమాటు కాపురం చేస్తోందంటూ దుయ్యబట్టారు.

హరిబాబు విజయసాయి రెడ్డి ట్వీట్‌పై మండిపడ్డారు. విమానంలో ఏ పార్టీవారైనా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హరిబాబు విశాఖ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వచ్చానని తెలిపారు. సహా ప్రయాణికులు ఎవరన్నది విజయసాయి రెడీ కి అనవసరమన్నారు. విమానంలో ఏ పార్టీకి చెందినవారైనా ప్రయాణించవచ్చని, ఈ విషయంలో ఎటువంటి నిషేధం లేదని విజయసాయిరెడ్డికి బదులిచ్చారు.