ప్రేమ జంటపై దుండగుల దాడి

SMTV Desk 2019-02-12 08:13:03  Andhra Pradesh, Nellore, Amaravathi

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో మరో ప్రేమకథ విషాదాంతమైంది. తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాస్, అంగడి జ్యోతి సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. ఏకాంతంగా ఉన్న ఈ ప్రేమ జంటపై ముగ్గురు దుండగులు దాడి చేసారు. దుండగులు యువకుడిని ఇనుప రాడ్లతో కొట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె పైన కూడా దాడి చేసారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

శ్రీనివాస్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ జ్యోతి ఆసుపత్రిలో కన్నుమూసింది. శ్రీనివాస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.