క్షమాపణలు తెలిపిన సీబీఐ అదనపు డైరెక్టర్‌

SMTV Desk 2019-02-12 07:14:08  CBI Additional Director, Supreme Court, Nageshawar Rao, AK Sharma, CBI Temporary Director

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ అదనపు అధికారి నాగేశ్వరరావు క్షమాపణలు చెప్పారు. సీబీఐ అధికారి ఏకే శర్మ బిహార్‌లోని ఆశ్రమ పాఠశాలల్లో బాలికల వేధింపులపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి ఏకే శర్మను గురువారం బదిలీ చేశారు. కాగా ఈ బదిలీపై సుప్రీమ్ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోమవారం ఈ కేసులో నాగేశ్వరరావు కోర్టుకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సీబీఐ తాత్కాలిక అధికారిగా ఉన్న సమయంలో కోర్ట్ అనుమతి తీసుకోకుండానే బదిలీ చేయడం పొరపాటని అందులో అంగీకరించారు. నా తప్పును అంగీకరిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నా. ఏకేశర్మ బదిలీ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం, ఉల్లంఘన అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆ బదిలీ చేసి ఉండాల్సింది కాదు అని అఫిడవిట్‌ పేర్కొన్నారు నాగేశ్వరరావు.