చంద్రబాబు దీక్ష ముగిసింది..

SMTV Desk 2019-02-11 21:38:25  Chandrababu, delhi deeksha, dharmaporata deeksha, end, deve gouda

ఢిల్లీ, ఫిబ్రవరి 11: నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ చేపట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ ముగిసింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ చంద్రబాబుకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. గం.12 పాటు సాగిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరై మద్దతు తెలిపారు

దీక్ష తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రేపు ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ఇక ఈ దీక్ష సందర్భంగా తమ వల్ల తప్పు ఏదైనా జరిగితే క్షమించాలని జాతీయ నేతలను కోరారు. కాగా నేతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలు, సభికులకు సూచించారు. అనంతరం జైహింద్ చెప్పి కార్యక్రమాన్ని ముగించారు.