జయరాం హత్య కేసు : దోషులకు రిమాండ్

SMTV Desk 2019-02-11 21:17:02  chigurupati jayaram, sika chowdary, padmasri, hyderabad police, telangana government, 14 days remand

హైదరాబాద్, ఫిబ్రవరి 11: కోస్టల్‌బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితులు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. కాగా వారి ఇరువురికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే జయరాం హత్యకేసు మొదట నందిగామలో నమోదైంది. కానీ హత్య హైదరాబాద్‌లో జరగటం వలన ఆంద్రా పోలీసులు ఇటీవల కేసును తెలంగాణకు బదిలీ చేయడంతో తెలంగాణ పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రేపు పోలీసులు నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఈ హత్య కేసులో జయరాం భార్య పద్మశ్రీ శిఖా చౌదరిని ప్రధాన నిందితురాలిగా ఆరోపిస్తుంది.