జగన్ మద్దతు కోరిన చంద్రబాబు..

SMTV Desk 2019-02-11 20:27:03  Jaganmohan Reddy, Chandra Babu, tdp, ycp, 2019 elections, darmaporata deeksha

ఢిల్లీలో, ఫిబ్రవరి 11: ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ తమతో కలిసి రావాలని కోరారు.

కాగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మీతో కలవాలని వైసీపీని ఎందుకు పిలుస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. దానికి సమాధానంగా వైసీపీకి ఒకటో.. రెండో స్థానాలొస్తాయని.. తమకు మద్దతివ్వడంలో తప్పు లేదని అన్నారు.