ఈసారి చంద్రబాబు యూటర్న్ తీసుకోరు : కన్నా

SMTV Desk 2019-02-11 18:12:27  Chandrababu, kanna lakshmi narayana, tdp, bjp, twitter, dharmaporata deeksha, u turn

అమరావతి, ఫిబ్రవరి 11: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కొత్త నాటకానికి తెరతీశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. దొంగ దీక్షలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 2019లో యూటర్న్ తీసుకునే అవసరం లేకుండా ప్రజలు ఆయనను నారావారి పల్లెకు సాగనంపనున్నారని ఎద్దవా చేసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

కన్నా తన ట్విట్టర్ ఖాతాలో.. మరో మహా నాటకం.! ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. మీరు U-టర్న్ సీఎం అని ప్రజలు భావిస్తున్నారు.. 2019లో U-టర్న్ తీసుకునే కష్టం లేకుండా "నారావారి పల్లె"కి పంపిస్తారు అని ట్వీట్ చేశారు.