ఆ సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యా: సురేందర్ రెడ్డి

SMTV Desk 2019-02-11 13:47:29  Surendar reddy, Yaatra, mammutty, Maruthi ,Surya

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర ఇటీవల విడుదలైంది. దీనిపై సినీపరిశ్రమ సెలబ్రిటీ లు స్పందించక పోవడంపై వైఎస్ఆర్ అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల దర్శకుడు మారుతీ తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. తమిళ నటుడు సూర్య కూడా వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించిన విధానాన్ని ప్రశంసించాడు.తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి యాత్ర పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "యాత్ర సినిమా చూసాను. ఇది ఒక ఎమోషనల్ జర్నీ. సినిమ చూస్తూ చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యాను. మమ్ముట్టి గారి నటన అద్భుతం. ఆయనను చూస్తుంటే స్క్రీన్ ఒఐరజన్నను చూస్తున్నట్టే ఉంది. చిత్ర యూనిట్ కి మనస్పూర్తిగా నా అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించారు.