ఇందనం మంత్రి ఇంట్లో ఐటి వేట...!

SMTV Desk 2017-08-02 18:49:01  Karnataka Energy Minister DK Shivakumar,Income Tax Department, Rs. 5 crore cash, Rs. 2.5 crore,44 MLAs are Congress MLAs, Resorts

న్యూఢిల్లీ, ఆగస్టు 2 : ఢిల్లీలోని క‌ర్ణాట‌క ఇంధన శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ ఇంట్లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ బుధ‌వారం ఉదయం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ. 5 కోట్ల న‌గ‌దు లతో పాటు 2.5 కోట్ల విలువైన ఆస్తులు ప‌ట్టుబ‌డ్డాయి. రాజ్యసభ ఎన్నికల ముందు భాజపాలో చేరిపోతారన్న భయంతో 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించారు. వారిని శివకుమార్ కు చెందిన ఒక రిసార్ట్స్ లో ఉంచారు. శివకుమార్ కూడా ఆ రిసార్ట్స్ లోని ఓ గదిలో ఉంటూ గుజరాత్ ఎమ్మెల్యేల ఆతిథ్య బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిసార్ట్స్ పై కూడా దాడి చేసిన ఆదాయ పన్ను అధికారులు, చాలా సేపు ప్రశ్నల వర్షం కురిపించారు. తరువాత ఆయన్ను ఇంటికి తీసుకెళ్లి విచారించారు. ఈ మేరకు గుజరాత్ ఎమ్మెల్యేలతో తమకు సంబంధం లేదని శివకుమార్ ఉన్నందునే రిసార్ట్స్ పై దాడులు జరిపామని ఐటి శాఖ వివరించింది. గుజరాత్ ఎమ్మెల్యేలకు ఆథిత్యం ఇవ్వడం తమ బాధ్యతని శివకుమార్ స్వయంగా చెప్పుకున్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గుజరాత్ ఎమ్మెల్యేలు రిసార్ట్స్ నుంచి వచ్చిన వెంటనే బెంగుళూరు చేరుకున్నారు. ఆగస్టు 8 న రాజ్యసభ ఎన్నికల వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవడం తమ బాధ్యతని శివకుమార్ ప్రకటించారు.