గిరిజనులపై చంద్రబాబు వరాల జల్లు

SMTV Desk 2019-02-11 07:49:18  Chandrababu Naidu, Girijanas, Pension, TDP

అమరావతి, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున వేళ రాజకీయ నాయకులూ ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ప్రజలను ఆకట్టుకునేల పలు పతకల గురించి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీ(టీడిపి) ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త చెప్పింది. సామాన్యంగా వృధప్య పింఛన్ వయోపరిమితి 65 ఏళ్ల, కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిని గిరిజనులకు 50 ఏళ్లకు కుదించింది. ఇకనుండి వారికి 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని తెలిపింది. ఇందుకోసం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలంటూ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది.