చంద్రబాబు ఢిల్లీ ప్రయాణనికి అంత సిద్దం

SMTV Desk 2019-02-09 14:48:50  Chandrababu Naidu, Delhi Tour, Two Trains, Narendra Modi, TDP, BJP

అమరావతి, ఫిబ్రవరి 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఒక్కరోజు దీక్ష కొరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఢిల్లీలో ఫిబ్రవరి 11న ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష కొరకు ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు రైళ్ళ కొరకు రూ. 1.12కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మోదీ వైఖరి పై నిరసన వ్యక్తం చేసేందుకు డిల్లీకి రావాలనుకునే వాళ్లు ఆ రైళ్లలో రావచ్చని స్పష్టం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన ఈ రైళ్లలు ఒక్కొక్క దానికి 20 కంపార్ట్ మెంట్లు ఉంటాయని తెలిపారు. ఒక రైలు శ్రీకాకుళం నుండి బయలుదెరగా, మరొకటి అనంతపురం నుండి బయలుదేరనుంది. పార్టీ నేతలు, ఆర్గనైజేషన్స్, ఎన్జీవోలు, సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో జరగునున్న ఒక రోజు దీక్షలో పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ దీక్షలో అన్ని విపక్షాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కొరారు. ఇందులో బీజేపీ మరియు ఇతర పార్టీలన్నీ పాల్గొంటాయని భావిస్తున్నారు.