అతిలోక సుందరి ప్రధమ వర్దంతికి ఏర్పాట్లు

SMTV Desk 2019-02-09 12:49:28  Sridevi, Chennai, First death anniversary, Boni Kapoor, Jahnvi Kapoor, Khushi Kapoor

చెన్నై, ఫిబ్రవరి 09: అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి ఏడాది గడిచింది. ఆమె మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలో ముంచింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఆమె దుబాయ్ లోని ఒక హోటల్ లో హఠాత్తుగా చనిపోయారు. శ్రీదేవి ప్రథమ వర్ధంతికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఆమె వర్ధంతిని చెన్నైలోని తన నివాసంలో ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించనున్నారు. తిథి ప్రకారం ఆ రోజు వర్థంతి వచ్చిందని బోనీ కపూర్‌ కుటుంబం తెలిపినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి బోనికపూర్, జాహ్నవి, కుషీ కపూర్, అనిల్ కపూర్ సతీమణి సునీత, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అంతేకాకుండా దక్షిణాది, హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆమె వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో శ్రీదేవి తన నటనతో అందరిని ఆకట్టుకుంది.