కాంగ్రెస్ పార్టీ కూడా మీ కుటుంబానికి ఎంతో చేసింది : తులసిరెడ్డి

SMTV Desk 2019-02-09 11:43:10  kadapa, ys jagan, pcc vice president, Tulasi reddy, congress party, Andhra pradesh

కడప, ఫిబ్రవరి 09: ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని అన్నారు. 2009లో జగన్ కు లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసేందుకు సైతం కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటిది ఇటీవల జరిగిన ఓ సభలో జగన్ కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కడప గడ్డ మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ కుటుంబానికి ఎంతో మేలు చేసిందని ఆయన స్పష్టం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆరుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండు సార్లు సీఎంగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. అలాంటిది జగన్ కడప జిల్లాలో జరిగిన పర్యటనలో కాంగ్రెస్ పార్టీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ఎంతమాత్రం సరికాదన్నారు.