జోరు పెంచిన పవన్, పలువురు ప్రముఖులకు కీలక పదవి

SMTV Desk 2019-02-09 10:34:27  Pawan Kalyan, IAS Chabdrasekar, Hariprasad, Radha Madhavan, Janasena

అమరావతి, ఫిబ్రవరి 09: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. జనసేన పార్టీలో చేరడానికి పలువురు ప్రముఖులు సైతం మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పార్టీలో వివిధ పదవులను భర్తీ చేస్తూ దూకుడు పెంచారు పవన్. తాజాగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తనతో పవన్ లు పదేళ్ల సాన్నిహిత్యం ఉందన్నరు. చంద్రశేఖర్‌ సర్వీస్ ఉండగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారని పవన్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, 1987లో సివిల్స్‌కు సెలెక్ట్ అయినప్పటి కంటే కూడా ఇప్పుడే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పవన్ రోజు రాత్రి రెండుమూడు గంటల వరకు పనిచేస్తుంటారని, అయినా ఆయన ముఖంలో ఎటువంటి అలసట ఉండదని, తాము మాత్రం ఊరికనే అలసిపోతున్నామని అన్నారు. కాగా, సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్‌ను పవన్ రాజకీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. జ‌న‌సేన ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రాం చైర్మన్‌గా రాధా మాధవ్‌ నియమితులయ్యారు.