చంద్రబాబు బయోపిక్ రిలీజ్ డేట్ విడుదల

SMTV Desk 2019-02-09 10:01:38  Chandrababu, Andhra Pradesh, Biopic, Chandrodayam, GVK Rajendra

అమరావతి, ఫిబ్రవరి 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా మర్చి 10న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్నీ శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో చిత్ర నిర్మాత జీవీకే రాజేంద్ర వెల్లడించారు. ఈ సినిమాకి పసుపులేటి వెంకటరమణ దర్శకత్వం వహించారు. 2016 ఆగష్టు లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించినట్టు రాజేంద్ర తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.