సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఇంట్లో సోదాలు

SMTV Desk 2019-02-09 09:41:29  CBI Temporary Director Nageshwar Rao, Police Investigation, Rajiv Kumar, Mamatha Banerjee

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: సీబీఐ అధికారులు శారద చిట్‌ఫండ్ కుంబకోణం కేసు దర్యాప్తు కోసం వెళ్ళగా, వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. శుక్రవారం కోల్‌కతా పోలీసులు సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు నిర్వహించారు. పోలీసులు ఆస్తుల పరిశీలనకు మాత్రమే వచ్చామని చెప్పినప్పటికీ ఇందులో రివెంజ్ ఉందని తెలుస్తుంది.

కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్ ను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చేపట్టడం ప్రతీకార చర్యగానే కనిపిస్తుందన్నారు. కాగా, నాగేశ్వరావు ఇళ్లపై సోదాలు నిర్వహించిన రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సోదాల్లో నాగేశ్వరరావు భార్య, కుమార్తె ఆధ్వర్యంలో ఉన్న కంపెనీతోపాటు స్టాల్‌లేక్‌లో నాగేశ్వరరావు భార్య సారథ్యంలో నడుస్తున్న ఓ కంపెనీ కూడా ఉన్నట్టు సమాచారం.