రేపు గవర్నర్‌ తో భేటీ కానున్న జగన్..

SMTV Desk 2019-02-08 21:35:41  Jaganmohan Reddy, 2019 elections, ycp, election commision, governer narasimhan

అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కొన్ని రోజులుగా ఏపీ ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై ప్రతిపక్ష అదినేత వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసారు. కాగా రేపు జగన్ ఇదే విషయమై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. జగన్‌కు గవర్నర్ నరసింహన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ లిస్టులోనూ అవకతవకలు జరుగుతున్నాయని జగన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గవర్నర్ తో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.