అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి : విజయశాంతి

SMTV Desk 2019-02-08 21:04:04  vijayashanthi, telangana congress, congress, trs, prathigatana, prathigatana song, love afairs, lover attacks

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన ప్రేమోన్మాదుల దారుణాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్, నటి విజయశాంతి తీవ్రంగా స్పందించారు. నేడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రేమోన్మాదుల అకృత్యాలపై మొక్కుబడి చర్యలు కాకుండా, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల గురించి వింటుంటే, తన ‘ప్రతిఘటన’ చిత్రంలోని ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..’ అనే పాట గుర్తుకువస్తోందని అన్నారు. అమ్మాయిల ప్రాణాలతో ప్రేమోన్మాదులు చెలగాటమాడటం అలవాటుగా మారుతోందని, ఈ తరహా సంఘటనల కారణంగా వారు మానసిక కుంగిపోయే ప్రమాదం ఉందన్నారు.