దేశ ప్రధానిపై ఫైర్ అయిన సీఎం..

SMTV Desk 2019-02-08 20:29:38  Chandrababu, narendra modi, ap assembly, tdp, bjp

అమరావతి, ఫిబ్రవరి 8: ఈరోజు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశారో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. ప్రధాని మోదికి దేశానికి ఎమన్నా చేద్దామని ఆలోచన కూడా లేదని, ఇలాంటి వ్యక్తిత్వం వల్ల దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనకుండా, వారి కష్టాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం రాటుదేలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకులపై బురద జల్లాలని, కార్పొరేట్ సెక్టర్ ని, మీడియాని కిల్ చేయాలని చూస్తున్నారని.. ఆయనొక్కడే ఉండాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే అందరూ కలిసిన మరుసటి రోజు ఈ ప్రధాన మంత్రి ఏమవుతారో ఆలోచించుకోండంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలకు డబ్బులు పంపించి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రే బేరసారాలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు కరెక్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి ఉందని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాలను అవలంబిస్తున్న భాజపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, తగిన పనిష్ మెంట్ ఇచ్చి తీరతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తమకు పట్టం కట్టాలని పవిత్రమైన శాసనసభ నుంచి ప్రజలను కోరుతున్నానని సీఎం అన్నారు.