మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..

SMTV Desk 2019-02-08 20:17:51  Mamata banerjee, West Bengal, tmc, bjp, giriraj singh, dhinesh trivedi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మమతను దెయ్యంగా అభివర్ణించారు. ఆమె దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా సీఎం మమతా బెనర్జీ ఆధునిక ఝాన్సీరాణిలా పోరాడుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత దినేశ్‌ త్రివేది గురువారం వ్యాఖ్యానించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలను ఆమె దీటుగా ఎదుర్కొంటున్నారని ఆయన కితాబిచ్చారు.

ఈ నేపథ్యంలో దీనిపై గిరిరాజ్‌ సింగ్ స్పందిస్తూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝాన్సీరాణితో మమతా బెనర్జీని పోల్చడం కంటే అవమానం మరోటి లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌తో ఆమెను పోల్చారు. అయితే సీబీఐతో మమత వివాదం నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కోనసాగుతోంది.