ప్రేమోన్మాది దాడి : కోలుకుంటున్న మధులిక

SMTV Desk 2019-02-08 20:16:05  madhulika, barath, doctors, health condition, health buliten

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ లోని బర్కత్ పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నాలుగు శస్త్ర చికిత్సల అనంతరం మధులిక ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు. కాగా ఎదుటివారి మాటలకు రెస్పాండ్ అవుతోందని చెప్పారు. అయితే.. మరో 48గంటలపాటు ఆమె వెంటిలేటర్ పైనే ఉండాల్సి వస్తుందని యశోద హాస్పిటల్ సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు.

కాగా దాదాపు 7 గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీల చేసినట్లు ఆయన తెలిపారు. సర్జరీల తర్వాత మధులిక కళ్లు తెరచి చూసిందని, డాక్టర్లు అడిగినదానికి సైగలు చేస్తుందన్నారు. బ్రెయిన్ పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశామని..ప్రస్తుతము మధులిక ఆరోగ్యము కుదుట పడిందన్నారు. అయితే ఇంకా 48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా నే ఉంటుందన్నారు. ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని చెప్పారు, 4 సర్జరీ చేశారు కాబట్టి ఆమె పూర్తిగా కోలుకోవాలంటే సమయం పడుతుందన్నారు. వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం కనబడుతోందన్నారు.