బాలీవుడ్ ను వణికిస్తున్న 'కేజిఎఫ్'

SMTV Desk 2019-02-08 20:11:28  KGF Part 1, Yash, Rajamouli, Bollywood, Kollywood, Tollywood

ముంభై, ఫిబ్రవరి 08: కేజిఎఫ్ పార్ట్ 1 సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే దీని ఎఫెక్ట్ బాలీవుడ్ పై గట్టిగా పడిందట. సౌత్ లో దర్శక ధీరుడు రాజమౌళి తో గట్టిగానే ప్రమోషన్స్ చేయించారు కాని బాలీవుడ్ లో ఎవరు ఈ సినిమా ప్రమోషన్స్ కు పెద్దగా సహయపడలేదు. తక్కువగా అంచనా వేశారు. అయినా కూడా సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ను దాటేసి బాలీవుడ్ కి దిమ్మ తీరిగేలా షాక్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా నేటితో హాఫ్ సెంచరీ కొట్టేసింది.

బాలీవుడ్ బడా స్టార్స్ నుంచి సినిమాకు మద్దతు రాకపోయినా సినిమా అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా 50 రోజులను పూర్తి చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పటికీ ఇంకా కన్నడ థియేటర్స్ లో సినిమా నడుస్తోంది. కన్నడ లో మొదటగా 100 కోట్ల గ్రాస్ ను అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 225కోట్లను రాబట్టింది. దీంతో చాలా వరకు బాలీవుడ్ స్టార్స్ ఈ లెక్కలకు షాక్ అవుతున్నట్లు టాక్ వస్తోంది.