వారానికి అర లీటర్ల రక్తం తీస్తూ రాక్షసత్వం చూపించిన తల్లి

SMTV Desk 2019-02-08 18:48:17  Denmark, Mother takes sons blood, Nurse, Court

డెన్మార్క్‌, ఫిబ్రవరి 08: ఓ తల్లి తన కుమారుని శరీరం నుండి గత ఐదేళ్లుగా వారానికి ఒక సారి రక్తం తీస్తూ వస్తుంది. ఈ దారుణ సంఘటన డెన్మార్క్‌లో చోటు చేసుకుంది. ఆ తల్లికి అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ శిక్షణ పొందిన నర్స్ అయిన ఆ మహిళ అనవసరంగా ఇలా రక్తాన్ని తీస్తూ వెళ్లింది. ఆ తీసిన రక్తాన్ని టాయిలెట్‌లో పారేసేదాన్నని ఆమె కోర్టుకు చెప్పింది. తాను చేసింది తప్పేనని, తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేయనని తెలిపింది. అసలు ఈ పని చేయడం ఎప్పుడు మొదలుపెట్టానో తెలియదు. ఎందుకు చేశానో తెలియదు. అలా చేస్తూ వెళ్లాను. ఆ తీసిన రక్తాన్ని టాయిలెట్‌లో పారేసి, సిరంజిలను చెత్త బుట్టలో పడేసేదాన్ని అని ఆమె కోర్టుకు చెప్పింది.

ఆ కొడుకు వయసు ఇప్పుడు ఏడేళ్లు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. పుట్టినపుడే పేగు సంబంధిత వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి.. ఆ తర్వాతి కాలంలో ఎందుకంతలా రక్తం కోల్పోతున్నాడో డాక్టర్లకు అంతు చిక్కలేదు. దీంతో ఆ ఐదేళ్లలో అతనికి 110సార్లు డాక్టర్లు రక్తం ఎక్కించారు. అయితే తల్లిపై అనుమానం వచ్చి ఆమెను పోలీసులు విచారించారు. ఓసారి బ్యాగులో రక్తాన్ని తీసుకెళ్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. మన్‌చౌసే అనే సిండ్రోమ్ (ఓ మానసిక రుగ్మత)తో బాధపడుతున్నట్లు సైకియాట్రిస్టులు కోర్టుకు తెలిపారు. ఇది చాలా చాలా అరుదైన రుగ్మత. దీని బారిన పడిన వాళ్లు .. అంటే సాధారణంగా ఓ తల్లి తనపై ఆధారపడిన వారికి లేని ఓ రోగాన్ని అంటగట్టి లేనిపోని చికిత్స చేస్తుంటుందని సైకియాట్రిస్టులు తెలిపారు.