చంద్రబాబుకి దన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేత..

SMTV Desk 2019-02-08 15:34:49  KVP ramachandra aro, letter, ap cm, chandrababu, special status

అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ధన్యవాదాలు తెలుపుతు లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసినవారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు సీఎం చంద్రబాబుకి దన్యవాదాలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ఏపీకి న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా లేఖ రాశారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని కేవీపీ పేర్కొన్నారు.