ఎమ్మెల్యే కిడారి హత్యకేసులో నిందితుడి అరెస్ట్..

SMTV Desk 2019-02-08 15:18:30  kidari sarveswara rao, mla,ex-mla siveri soma, muder, accused one arrest

విశాఖపట్టణం, ఫిబ్రవరి 8: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధం ఉన్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒరిస్సాలోని పాడువా అటవీ ప్రాంతంలో నిందితుడు డొంబురు కిలో ను నిన్న రాత్రి పాడువా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

కాగా నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు. 2018 సెప్టంబర్‌లో విశాఖపట్టణం జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్పట్టిపుట్ట వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.