ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నం

SMTV Desk 2019-02-08 14:26:25  Special Status, Andra Pradesh, Anil Kumar, Lawyer, Nandhyala, Suicide Attempt

అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ లో మరో వ్యక్తి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఈ దుర్గటనకు పాల్పడ్డాడు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఈరోజు కోర్టు ఆవరణలోనే ఆయన పురుగుల మందు తాగాడు.

అనిల్ తన నుదుటిపై ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని రాసుకొని మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు, తోటి లాయర్లు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.