అన్న అమృతహస్తం పథకం: లోకేశ్

SMTV Desk 2019-02-08 13:36:50  Nara Lokesh, Anna Amrutha Scheme, Nutri Garden, Twitter

అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఓ కొత్త కార్యానికి శ్రీకారం చుట్టారు. ఏపీ లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రీ గార్డెన్ లను లోకేశ్ ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీటిని పెంచుతున్నామని వెల్లడించారు.

అన్న అమృతహస్తం పథకం , ఈ పథకం కింద ఆకుకూరలు, కూరగాయలను అంగన్ వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఓ న్యూట్రీ గార్డెన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇక్కడ మనం చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, మాచవరం పంచాయితీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన న్యూట్రీగార్డెన్. గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఉపాధి హామీ పథకం కింద ఊరూరా న్యూట్రీగార్డెన్ లను పెంచుతున్నాం.ఇక్కడ పండించిన ఆకుకూరలు, కూరగాయలను అంగన్ వాడీ కేంద్రాల్లో అన్న అమృతహస్తం పథకం కింద లబ్దిదారులకు అందించే రోజువారీ వంటకాల్లో ఉపయోగించడం జరుగుతోంది అని ట్వీట్ చేశారు.