ఢిల్లీ విమానాశ్రయంలో బాంబు కలకలం

SMTV Desk 2017-08-02 16:33:41  suzuki car parts become reason for bomb fear, Delhi airport,, Car parts

ఢిల్లీ, ఆగష్టు 2: ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులగా వణికిస్తున్న తుపాకుల శబ్దాలు, బాంబుల పేలుళ్ల నేపధ్యంలో ప్రస్తుతం మన దేశంలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే చాలు భయంతో ప్రాణం అరిచేతుల్తో పట్టుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఉదయం చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే... ఢిల్లీ విమానాశ్రయం కార్గో టర్మినల్‌లో నాలుగు వైర్లు, ఫ్యూజులు, ఒక ఎలక్ట్రానిక్ మీటర్‌లాంటి కొన్ని వస్తువులు చూసి ఢిల్లీ విమానాశ్రయ అధికారులు బాంబు అనుకుని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఆఘమేఘాలపై అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్, ఆ మెటీరియల్‌ను వేరు చేసి, అవి మారుతి సుజుకి కారుకు సంబంధించిన భాగాలని స్పష్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు ఇవి కారులో పనికిరాకుండాపోయిన విడి భాగాలని చెప్పే సరికి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి పరిస్థితే 2016 జనవరిలో అనుమానాస్పద బెలూన్ చూసినప్పుడు చోటుచేసుకుంది.